|
కొడాలి నాని మదమెక్కి మాట్లాడుతున్నాడు February 8, 2010 అదుర్స్ సినిమా నిర్మాత కొడాలి నాని మదమెక్కి మాట్లాడుతునారని,
సినిమాతో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చడం ఆయన మతిస్థిమితానికి నిదర్శనమని ఎంపీ మధుయాష్కి
గౌడ్ అన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని, తెలంగాణ ప్రజలన మనోభావాలను కించపరిచే
వ్యాఖ్యలు వేనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి
వస్తుందని మధుయాష్కి అన్నారు. తెలంగాణ జేఏసీలో కోవర్టులున్నారని, జేఏసీ భేటీ
విషయాలను సీమాంధ్ర నేతలకు తెలియజేస్తూ ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని
మధుయాష్కి వ్యాఖ్యానించారు.
|